Take a fresh look at your lifestyle.

నేడు పంచముఖిలో హనుమాన్ జయంతి ఉత్సవాలు 

 

ముద్ర ప్రతినిధి, మెదక్:

మెదక్ పట్టణం గోసముద్ర తటాక తీరాన వెలసిన శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయం హనుమాన్ జయంతి ఉత్సవాలకు ముస్తాబైంది. ఈనెల 2న ఉదయం  6 గంటల నుండి ప్రత్యేక పూజలు జరుగును. ఉ.7.30 గంటల నుండి 108 పర్యాయములు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ జరుగును. 11.00 గంటల నుండి అన్నప్రసాద వితరణ జరుగును. రాత్రి 9.30 నుండి భక్తులచే భజన కార్యక్రమము జరుగుతుందని వంశానుగత ధర్మకర్త కాకులవరం మధుసూధనా చారి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు

Leave A Reply

Your email address will not be published.