పోలీసుల భారీ బందోబస్తు
భద్రతపై ఎస్పీ ప్రత్యేక దృష్టి
ముద్ర, వనపర్తి :
వనపర్తి జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల్లో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి భారీ పోలీసు బందోబస్తు నడుమ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. బుధవారం జిల్లాలో జరుగుతున్న ఐదు మున్సిపాలిటీలను పర్య వేక్షించిన ఎస్పీ సునీత రెడ్డి కిందిస్థాయి అధికారులకు గట్టి బందోబస్తు తో పాటు ఓటర్లకు భరోసా కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. భద్రతతో పాటు వృద్ధులు వికలాంగులు బాలింతలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన సందర్భంలో పోలీసులు వారికి అందించిన సేవలను ఎస్పీ అభినందించారు. మొత్తానికి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.