Take a fresh look at your lifestyle.

హంగ్ స్ధానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి మంత్రులు, సీనియర్ నాయకులకు సీఎం దిశానిర్దేశం

 

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

మున్సిపల్ ఫలితాల్లో హంగ్ ఏర్పడిన స్ధానాల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు, సీనియర్ నాయకులకు సూచించారు. క్షేత్రస్ధాయిలో స్వతంత్రులు, ఇతర పార్టీ అభ్యర్ధులతో సంప్రదింపులు జరిపి ఆయా పుర పీఠాలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ధిశానిర్దేశం చేశారు. ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత తదుపరి కార్యచరణపై దృష్టి సారించిన సీఎం..శనివారం జూబ్లీహిల్స్​లోని తన క్యాంపు కార్యాయలంలో మంత్రులు, సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేషన్లు, పురపాలక సంఘాల ఫలితాలపై చర్చించారు. మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్కరిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆశించిన ఫలితాలు రావడంతో సంతృప్తిని వ్యక్తం చేసిన సీఎం హంగ్ మున్సిపాలిటీల విషయములో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని సూచించారు. కాగా ఈ నెల 11న విడుదలైన ఫలితాల్లో 38 మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చింది. వీటిలో సాధ్యమైనన్ని మున్సిపాలిటీలలో అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. స్వతంత్రుల మద్దతుతో సుమారు 20 వరకు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసే అవకాశాలున్నాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆ దిశగా తీసుకోవాల్సిన వ్యూహంపై సీఎం దిశానిర్దేశం చేశారు. మేయర్​, ఛైర్మన్​ ఎంపిక కార్యచరణపై కూడా ఆయన నేతలకు ఆదేశాలు జారీచేశారు. ఎక్స్​ అఫీషియో ఓటర్ల నమోదుపై ప్రజాప్రతినిధులకు సీఎం సూచనలు చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.