Take a fresh look at your lifestyle.

కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

కొల్లాపూర్, పర్యాటక, సాంస్కృతిక మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలంలో పర్యటించనున్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారించడంతో పాటు మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

పర్యటనలో భాగంగా గ్రామాల్లో పర్యటించి స్థానికులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకోనున్నారు. అనంతరం ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమగ్ర సమీక్ష జరపనున్నారు.

పర్యటన షెడ్యూల్:

ఉదయం 7 గంటలకు కొల్లాపూర్ నివాసం నుంచి బయలుదేరుతారు.

ఉదయం 9:15 నుంచి 9:45 వరకు చిన్న దగడ (దగడపల్లి) గ్రామంలో పర్యటన.

ఉదయం 9:45 నుంచి 10:45 వరకు అమ్మాయిపల్లి గ్రామంలో ప్రజలతో భేటీ.

ఉదయం 11 గంటలకు పెద్దదగడలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకొని మధ్యాహ్నం 1 గంట వరకు మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం.

ఈ పర్యటనలో గ్రామీణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.