- దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న కొండ్రికర్ల కల గ్రామ ప్రజల కల నెరవేరిన వేళ.
- ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్న గ్రామస్తులు.
కోరుట్ల, ముద్ర విలేఖరి: దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కొండ్రికర్ల బ్రిడ్జికి మహర్దశ వచ్చిందని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న జువ్వాడి నర్సింగరావు నేడు బ్రిడ్జి నిర్మాణానికి 6 కోట్ల 80 లక్షల రూపాయల నిధులను ప్రభుత్వం ద్వారా విడుదలకు కృషి చేశారు. ఈ నిధులను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కు, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు ధన్యవాదాలు తెలుపుతూ వారి చిత్ర పటాలకు గ్రామ ప్రజలు పాలాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ గెలుపైన, ఓటమైన ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం అనే నినాదంతో ముందుకు నడుస్తున్న జువ్వాడి సోదరులకు గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.