కోరుట్ల/మేడిపల్లి, ముద్ర విలేకరి: ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశాలతో వేములవాడ నియోజకవర్గనికి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చెస్తు ఉత్తర్వులు జారీ చేయడంతో మేడిపెల్లి మండల కేంద్రంలో బీమారం, మేడిపెల్లి మండల నాయకులు అంబెడ్కర్ విగ్రహం వద్ద టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గనికి యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు మండల ప్రజలు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడిపెల్లి మండల అద్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డి, బీమారం మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చెర్మైన్ మాదం వినోద్, వైస్ చెర్మైన్ మిట్టపల్లి రాజిరెడ్డి, సభ్యులు, సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదిరులు పాల్గొన్నారు.