Take a fresh look at your lifestyle.

ఉచిత వైద్యం అందించడం అభినందనీయం: న్యాయమూర్తి శ్రీదేవి

ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి : ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని సైతం ఉచితంగా అందించడం అభినందనీయమని కల్వకుర్తి కోర్ట్ న్యాయమూర్తి శ్రీదేవి అన్నారు .శనివారం కల్వకుర్తి పట్టణంలో ఐక్యత ఫౌండేషన్, శంకర నేత్రాలయ చెన్నై ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని న్యాయమూర్తి పరిశీలించి మాట్లాడారు. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి కల్వకుర్తి ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతుగా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం వల్ల పేదలకు మేలు జరుగుతుందని అన్నారు. సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 13వ తేదీ ఆదివారం వరకు.ప్రతి రోజు ఉదయం 09:00 గం.ల నుండి మధ్యాహ్నం 01:00 గం.ల కంటి పరీక్షలు చేయడం జరుగుతుందని ఉచిత కంటి పరీక్షలతో పాటు,కంటి శుక్లాలకు ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సీనియర్ డాక్టర్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఉచిత శిబిరాలు నిర్వహించడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుందని అన్నారు. మునుముందు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని సూచించారు.మొదటి రోజు 800 మందికి పైగా శిబిరానికి హాజరుకాగా 600 మందికిపైగా కంటి పరీక్షలు చేశారు. అందులో 35 మందికి కంటి శుక్లాల సర్జరీలకి ఎంపిక చేశారు. 300 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు.కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.