Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. -ఎమ్మెల్యే మందుల సామెల్ .

 

ముద్ర ,మోత్కూర్ :

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక) లో భాగంగా గురువారం మోత్కూరు పురపాలక సంఘ పరిధిలోని 12 వార్డులలో  వార్డు కౌన్సిలర్ల అధ్యక్షతన వార్డు సభలు నిర్వహించారు. 1, 2 వ వార్డుకి సంబందించి నిర్వహించిన వార్డు సభ సమావేశమునకు  ఎమ్మెల్యే మందుల సామెల్ ముఖ్య అతిదిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. వార్డు సభ ప్రారంభానికి ముందు  తెలంగాణ రాష్ట్ర గీతం ఆలకించి, గౌరవ ముఖ్యమంత్రి  సందేశాన్ని మున్సిపల్ కమిషనర్ కె సతీష్ కుమార్ చదివి వినిపించారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అమలు చేయబోవు పథకాలు ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం, ప్రభుత్వ విధ్యసంస్థలలో అల్పాహారం  మధ్యాహ్న భోజన పథకం, ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగులైన విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాలు పంపిణీ  గురించి ప్రజలకు  వివరించారు. మోత్కూరు మున్సిపాలిటీ లో వివిధ కారణాల వలన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించలేని 27 మంది లబ్దిదారుల స్థానములో నూతన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మంజూరీ, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమములో చైర్ పర్సన్ గడ్డం స్వప్న వైస్ చైర్ పర్సన్ పల్లెర్ల వెంకన్న, వార్డు కౌన్సిలర్లు ప్రమీల, స్వామి, శోభ, అనురాధ, శైలజ, శ్రీవిధ్య, శ్రీకాంత్, మధు, వెంకన్న, రమణ తహశీల్దార్ జ్యోతి, కమిషనర్ కె. సతీష్ కుమార్, మండల అభివృద్ధి అధికారి బాలాజీ, విద్యుత్ అధికారులు ఏ డి ఈ బాలు నాయక్ , ఏఈ ప్రభాకర్, వ్యవసాయ శాఖ అధికారిని కీర్తి, ఏ ఈ ఓ గోపీనాధ్ , వార్డు అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.