Take a fresh look at your lifestyle.

నగరంలోని స్పా సెంటర్‌పై పోలీసుల మెరుపు దాడి: ఇరవై మంది అదుపులోకి

ముద్ర కూకట్‌పల్లి :

హౌసింగ్‌బోర్డ్ కాలనీ లోని ఒక ప్రముఖ స్పా సెంటర్ లక్ష్యంగా పోలీసులు మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఈ సోదాలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
స్పా సెంటర్ నిర్వాహకులు నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన పోలీసులు, వారిపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. రైడ్ సమయంలో అక్కడ ఉన్న నిర్వాహకులు, సిబ్బంది మరియు ఇతరులతో కలిపి మొత్తం 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
​అనుమతులు లేకుండా స్పా నడపడం, అనైతిక కార్యకలాపాలకు పాల్పడటం వంటి కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
​స్థానికంగా నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న ఇలాంటి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు హెచ్చరించారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.