Take a fresh look at your lifestyle.

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ . -అంబేద్కర్ ఆశయా సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. -మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య.

ముద్ర, మోత్కూర్:

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషిచేసిన గొప్ప మహానుభావుడు అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్, కౌన్సిలర్లు కురిమిళ్ళ ప్రమీల, సుల్తాన్ స్వామి, కొండ శోభ, మొగ్గుళ్ళ అనురాధ, గనగానీ శైలజ, పన్నాల శ్రీవిద్య, బీసు శ్రీకాంత్, నల్ల మధు, కారు పోతుల వెంకన్న, మెంట రమణ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.