Take a fresh look at your lifestyle.

ఘనంగా అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ.. పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే

 

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:

రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పించిన ఘనత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌కే దక్కుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. డాక్టర్ బీఅర్ అంబేధ్కర్ 135వ జయంతి సందర్భంగా కేటిదొడ్డి మండలం కొండాపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంగళవారం గద్వాల ఎమ్మెల్యే ఆవిష్కరించి, విగ్రహానికి‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని వర్గాలకు హక్కులను రాజ్యాంగంలో అంబేద్కర్‌ పొందుపర్చారన్నారు. రాజ్యాంగ పరిరక్షణే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. అంబేద్కర్‌ కలలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న అడుగులలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ కుర్వ హనుమంతు, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, గద్వాల మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్, సర్పంచ్ లు పవన్ కుమార్ రెడ్డి, నారాయణ, స్థలదాత గౌళ్ల లలితమ్మ నాగిరెడ్డి, మండల నాయకులు ఉరుకుందు, శేఖర్ రెడ్డి, తిమ్మారెడ్డి, రాజేష్, శేఖర్ రెడ్డి, కన్న, నారాయణ, వెంకట్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.