Take a fresh look at your lifestyle.

వట్టెం నవోదయ విద్యార్థుల ప్రతిభ చాటిన విజయం

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి పరీక్షా ఫలితాలలో వట్టెం జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణతతో పాటు నాణ్యమైన ఫలితాలను సాధించినట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ బాలాజీ నాయక్ తెలిపారు.

ఈ ఫలితాలలో కొల్ల సింధూజ రాణి 97.20 శాతం (486/500) మార్కులతో మొదటి స్థానం సాధించగా, నీలి లిఖిత 96.80 శాతం (484/500) మార్కులతో రెండో స్థానం, రసుమొల్ల హేమంత్ 96.40 శాతం (482/500) మార్కులతో మూడో స్థానం సాధించారు. ఈ విజయంపై పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

అలాగే 80 శాతం పైగా విద్యార్థులు డిస్టింక్షన్ మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. సైన్స్‌లో ముగ్గురు విద్యార్థులు 100 మార్కులు సాధించగా, ఇంగ్లీష్ మరియు తెలుగులో ఒక్కొక్కరు పూర్తి మార్కులు సాధించారు. సోషల్ స్టడీస్‌లో ఇద్దరు విద్యార్థులు 99 మార్కులు పొందారు.

నాణ్యమైన ఫలితాలతో విద్యాలయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన విద్యార్థులను ప్రిన్సిపాల్ అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.