కాప్రా, ముద్ర విలేకరి: బిజెపి తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షునిగా ఎన్నికైన రామచంద్ర రావును శుక్రవారం ఆ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర సీనియర్ నాయకులు మర్రి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు.బీజేపీ నాయకులు శ్రీనివాస్ యాదవ్, కృష్ణ రెడ్డి, రమేశ్ యాదవ్ తదితరులు పాల్గొని రామచంద్రరావుకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలంతా ఇప్పటి నుంచే వీర సైనికులై పనిచేయాలని పిలుపునిచ్చారు.