Take a fresh look at your lifestyle.

మోటకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..

ముద్ర, ప్రతినిధి భువనగిరి :
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి లో వైద్యులు , సిబ్బంది రోజు వస్తున్నారా లేదా అని అటెండన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. ఆసుపత్రి లో ఎంతమంది వైద్య సిబ్బంది పని చేస్తున్నారని ఆరా తీశారు. ఆసుపత్రి కి చెకప్ కోసం వచ్చిన గర్భిణి స్త్రీ లతో కలెక్టర్ మాట్లాడుతూ రెగ్యులర్ గా వచ్చి చెకప్ చేయించుకోవాలన్నారు. అనంతరం మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పనుల పురోగతి పై అధికారులతో మాట్లడారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ రాజేంద్ర ప్రసాద్, యం.పి.డి.ఓ ఇందిర, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.