- జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సూచించారు. భూ భారతీ పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులో భాగంగా శుక్రవారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెల్గొండ,గంగాపూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సు లో పాల్గొని రైతులతో మాట్లాడారు.వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ, సత్వర పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని తహసీల్దార్ దృష్టికి తెచ్చి అప్పటికప్పుడే పరిష్కారం జరిగేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు.పైలెట్ ప్రాజెక్టు కింద నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను మండలం లోని రెండు టీములు ఏర్పాటు చేయడమైనది ఒకటి బుగ్గారం మండల తహసిల్దార్ గంగాపూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించగా, ధర్మపురి తహసిల్దార్ వెల్గొండ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు.రైతులకు పెండింగ్లో ఉన్న భూ సంబంధిత సమస్యలకు సంబంధించిన అర్జీలను రేపు కూడా అధికారులకు అందించవచ్చని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులను రైతులు ప్రజలు వినియోగించుకొని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.ఈ సదస్సులో జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, తహసిల్దార్ బుగ్గారం మజీద్, ధర్మపురి తహసిల్దార్ కృష్ణ చైతన్య, రెవిన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
