Take a fresh look at your lifestyle.

ఆలయ భూములు కాపాడాలని వినతి

ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : కల్వకుర్తి మండలం రఘుపతి పేట రామగిరి దేవాలయ భూములను కాపాడాలని దేవాదయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీమతి కృష్ణవేణి కి గ్రామస్తులు, బిజెపి నాయకులు మంగళవారం వినతి పత్రం అందించారు. ఆలయానికి చెందిన 540 ఎకరాలు భూములలోని 100 ఎకరాలకు పైగా ఉన్నగుట్టను కొంతమంది కాంట్రాక్టర్ లు ఇష్ట రీతిన మట్టిని అక్రమంగా తరలించడం జరుగుతుందని, దేవాలయ భూములను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు, మట్టిని అక్రమంగా తవ్విన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దుర్గ ప్రసాద్ , నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.