Take a fresh look at your lifestyle.

ముఖ్యమంత్రిపై తీన్మార్ మల్లన్న వాక్యాలు సరికాదు

  • అందే భవితారాణి కోరుట్ల నియోజకవర్గ మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు

మెట్ పల్లి, ముద్ర: మొన్న జరిగిన బి ఆర్ఎస్ 25వ రజతోత్సవ సభలో కెసిఆర్ చేసిన ప్రసంగాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నట్టు కోరుట్ల నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అందే భవితారాణి అన్నారు. గత బి ఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి పాలనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి పేరును పలగడానికే కేసీఆర్ భయపడ్డారని దాన్ని రేవంత్ రెడ్డి పేరు ఎత్తకపోవడం గంజిలో ఈగతో పోల్చడం తీన్మార్ మల్లన్నకు తగదని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని అనుభవిస్తూ ముఖ్యమంత్రిని ఏదోరకంగా విమర్శించడం పద్ధతి కాదు మల్లన్న ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రిపై లేనిపోని వాక్యాలు చేయడం మంచిది కాదని మల్లన్న చేస్తున్న విమర్శలు బీసీలే వ్యతిరేకిస్తున్నారని అందే భవిత రాణి అన్నారు. ఇప్పటికైనా మల్లన్న తీరు మార్చుకోకపోతే మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అన్ని కులాలు మతాలు సంతోషంగా ఉన్నారని ప్రభుత్వ పనితీరును హర్షిస్తున్నారని దానిని చూసి ఓర్వలేక తీన్మార్ మల్లన్న నువ్వు బిఆర్ఎస్ తొత్తుగా మారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తే కుట్రలు కుతంత్రాలు మానుకోవాలని అందే భవితరాణి అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.