Take a fresh look at your lifestyle.

లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకున్న క్యామ మల్లేష్

ముద్ర, బీబీనగర్ :

బీబీనగర్ మండలంలోని వెంకిర్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల్లో భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ క్యామ మల్లేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సోము రమేష్ కురుమ, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, మాజీ వైస్ ఎంపీపీ లింగయ్య గౌడ్, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు మంచాల రవికుమార్, బిఆర్‌ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చింతల నాగలక్ష్మి లక్ష్మీనారాయణ, గ్రామ ఉప సర్పంచ్ జిలకపల్లి లక్ష్మీనారాయణ, బీఆర్‌ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు షేక్ హుస్సేన్, టిఆర్ఎస్వి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కి నాగేష్, రాష్ట్ర గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుండబోయిన అయోధ్య యాదవ్, నాయకులు యాకరి యాదగిరి, జగన్, అజయ్, సిల్వేరు భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.