ముద్ర పెబ్బేర్
తోటి స్నేహితురాలు ఇటీవలే పాము కాటుకు గురై మరణించడంతో ఆమెతో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు ఆర్థిక సహాయాన్ని అందించి, వారి కుటుంబానికి అండగా నిలిచారు. తమకు తోచినంత సహాయాన్ని అందించి ఇంకా మానవత్వం ఉందని ఆ స్నేహితులు నిరూపించారు. వివరాలలోకి వెలితే .. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రానికి చెందిన రేపల్లె పుష్పలత (34) గత వారం పాము కాటుకు గురై మరణించింది. భర్త రాజేందర్ తో పాటు ఇద్దరు కూతుర్లు ధరణి (2), (5నెలలు చిన్నారి) ఉన్నారు. ఆమె కుటుంబం ఆర్థికంగా చితికి పోవడంతో ఆపదలో ఉందని తెలుసుకొని ఆమెతో అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-07 టెన్త్ బ్యాచ్ చదువుకున్న తోటి మిత్రులు మానవతా దృక్పథంతో సహాయం అందించి ఆదుకోవాలని సంకల్పించి సుమారు రూ.30,000 డబ్బులు జమ చేసిన అట్టి సొమ్మును పుష్పలత ఇద్దరి కూతుర్ల పేరిట బ్యాంకులో ఫిక్స్డ్(FD) డిపాజిట్ చెయ్యాలని వారి కుటుంబ సభ్యులకు సూచించారు. సహాయం అందించిన స్నేహితులందరిని గ్రామస్తులు పలువురు అభినందించారు.