Take a fresh look at your lifestyle.

కలెక్టర్ చే మీడియా అక్రిడిటేషన్ కార్డుల అందజేత

 

ముద్ర, నారాయణ పేట :

జిల్లాలో పని చేస్తున్న గుర్తింపు కలిగిన జర్నలిస్టులకు 2026 – 2028 కాల వ్యవధి కోసం మంజూరైన తొలి విడత అక్రిడిటేషన్ కార్డులను జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్, కలెక్టర్ సిహెచ్ ప్రియాంక బుధవారం కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో లాంఛనంగా అందజేశారు. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు, మీడియా జిల్లా ప్రతినిధులు, డీపీ ఆర్వో కార్యాలయ సిబ్బంది కలెక్టర్ చేతుల మీదుగా కార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్ఓ ఎం ఏ రషీద్, టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు కే నారాయణరెడ్డి, భీం సేన్ రావు, శ్రీధర్ రావు, నరేందర్, రఘుగణప, నక్క శ్రీనివాస్, మధుకర్, సులిగేం సురేష్, మహమ్మద్ తకి, సంజీవ్ ప్రకాష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.