ముద్ర, నారాయణ పేట :
నారాయణపేట జిల్లా కేంద్రంలోని బహార్ పేట లో గల చౌడేశ్వరి మాత అమ్మవారి ఆలయ నిర్మాణానికి గాను అమ్మవారి భక్తుడు జరంగ్ రాము రూ. 26 వేల విరాళం అందించారు. అంతకు ముందుగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణానికి తన వంతు ఆర్థిక సహాయం అందించిన దాతలు ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అప్పిరెడ్డిపల్లి రాము, కురువ మనోజ్, గడ్డం వినోద్, మసి పవన్, జెట్టి అంజి, బాపన్ పల్లి రవి, ఉట్కూర్ నర్సింహులు, గురు మేస్త్రి, శంభు ప్రభాకర్, శంభు కృష్ణ, మన్నే ఎల్లప్ప, దత్తు తదితరులు పాల్గొన్నారు.