Take a fresh look at your lifestyle.

ఈనెల 14న తిరుమలగిరిలో జరిగే కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి

  • భారీ బహిరంగ సభకు హాజరవుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
  • తుంగతుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్.

తుంగతుర్తి, ముద్ర: ఈనెల 14వ తేదీన తిరుమలగిరిలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్ అన్నారు బుధవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని సన్న బియ్యం పథకంతో పేద ప్రజలకు ఎంతో ఊరట లభించింది అని అన్నారు ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా రైతు రుణమాఫీ లాంటి పథకాలను అమలు చేసి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను క్రమం తప్పకుండా అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల మన్ననలు అందుకున్న ముఖ్యమంత్రి హాజరుకానున్న భారీ బహిరంగ సభ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందున ప్రజలు భారీ సంఖ్యలో హాజరుకావాలని కోరారు ఈ సభకు సుమారు 50 నుండి 60 వేల మంది హాజరవుతారని అందులో భాగంగా తుంగతుర్తి మండలం నుండి సుమారు 5000 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలను తరలించినట్లు గోవర్ధన్ తెలిపారు గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు మందుల సామేల్ ఆధ్వర్యంలో తుంగతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం జరుగుతుందని ఈ సమావేశానికి 24 గ్రామపంచాయతీల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు ముఖ్య నాయకులు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, తుంగతుర్తి పట్టణ అధ్యక్షుడు ఉప్పుల రాంబాబు, దేవాలయ చైర్మన్ సంజీవ, కటకం సూరయ్య, కటకం వెంకటేశ్వర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు పెద్ద బోయిన అజయ్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్ రెడ్డి, కొండరాజు, మాచర్ల అనిల్, అబ్దుల్, నాగరాజు,, బొంకూరి రమేష్, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.