Take a fresh look at your lifestyle.

కులం పేరుతో చిన్నారిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి…

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై నోరు విప్పాలి :   సిపిఎం కేంద్ర కమిటి సభ్యులు వీరయ్య..
సిపిఎం ఆధ్వర్యంలో కుల దూరహంకార హత్యపై నిరసన
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మర గ్రామంలో కులం పేరుతో రెండు నెలల చిన్నారిని హత్య చేసిన గ్రామ కులదురహంకారులను కఠినంగా శిక్షించి ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నోరు విప్పాలని సిపిఎం కేంద్ర కమిటి సభ్యులు ఎస్. వీరయ్య అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ చౌరస్థలో కొమ్మెర కుల దూరహంకార హత్యను నిరసిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ నెల 18తేదిన కొమ్మర జాతరలో దైవ దర్శనానికి వచ్చిన వెనుకబడిన సామాజిక వర్గం రజక కుటుంబానికి చెందిన కీర్తన కుటుంబంపై గ్రామ పెత్తందారులు కులం పేరుతో తన కుంటుంబ సభ్యులపై పైశాచికంగా వ్యవహారిస్తూ దూశించి దాడి చేయగా రెండు నెలల పసి పాపను చూడకుండా దాడి చేయడంతో మరణించడం జరిగిందన్నారు. ఘటన జరిగి వారం గడుస్తున్నా పోలీసు యంత్రాంగం చూసి చూడనట్లుగా వ్యవహారిస్తుంది అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో బలహీన వర్గాలపై జరిగే కుల దూరహంకార హత్యపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని అన్నారు. గ్రామ సర్పంచ్ స్థాయిలో ఉంది ఈ చర్యకు పాల్పడితే వారికి అధికార పార్టీ అండగా నిలబడటం సరికాదని అన్నారు. రాష్ట్రంలో కులం, మతం పేరుతో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఈ ఘటనలో ప్రధాన దోషులను ఇప్పటికి అరెస్ట్ చేయలేదని ఇది సమాజమంతా తల దించుకునే అమానవీయ చర్య అన్నారు. కులం పేరుతో జరిగే హత్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసి సక్రమంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్, రాష్ట్ర కమిటి సభ్యులు కొండమడుగు నర్సింహా, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జల్లెల పెంటయ్య, గుంటోజు శ్రీనివాస చారి, జిల్లా కమిటి సభ్యులు మాయ కృష్ణ, బొలగాని జయరాములు, బొల్లు యాదగిరి, అవ్వారు రామేశ్వరి, ఎండి. పాషా, బొడ్డుపల్లి వెంకటేశం, గంగాదేవి సైదులు, ఎంఏ. ఇక్బాల్, వనం ఉపేందర్, గుండు వెంకటనర్సు, కోట రామచంద్రారెడ్డి, మధ్యపురం రాజు, బల్గూరి అంజయ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.