Take a fresh look at your lifestyle.

కొండగట్టు గిరి ప్రదక్షిణలో పాల్గొన్న మంత్రి అడ్లూరి..

ముద్ర న్యూస్ , కొండగట్టు : గురు వ్యాస పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి గిరిప్రదక్షిణలు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు.

తెల్లవారుజాము నుండి వర్షం కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా గిరి ప్రదక్షిణలు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆంజనేయస్వామి చూడాలని కోరుకున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.