రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : స్థానిక క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేసి భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం తరఫున మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి గ్రామానికి చెందిన బలికొండ కిషన్ వినతి పత్రాన్ని అందించారు. ఆదివారం బొక్కల గుట్ట గ్రామానికి వచ్చిన మంత్రి వివేక్ కు గ్రామస్థులు స్వాగతం పలికారు. అనంతరం భక్తులు జాతర సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే బొక్కలగుట్ట,పులిమడుగు గ్రామపంచాయతీ లతో పాటు క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలని కోరారు. మాజీ సర్పంచ్ రాధా కిషన్ రావు, గ్రామస్థులు పాల్గొన్నారు.