రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : రెవెన్యూ సదస్సులతోనే భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మందమర్రి తహసిల్దార్ పి.సతీష్ కుమార్ అన్నారు. గురువారం క్యాతన్ పల్లి,తిమ్మాపూర్ గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. భూ సమస్యలపై క్యాతన్ పల్లిలో 26,తిమ్మాపూర్లో 38 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. రెవెన్యూ సదస్సు కార్యక్రమం శుక్రవారం సైతం యధావిధిగా జరుగుతుందన్నారు. నాయిబ్ తాసిల్దార్ సంతోష్,ఆర్ఐ గణపతి,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.