ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రామగుండం ఏరియా 1 ఆద్వర్యం లో జిఎం కాలనీలోని గోదావరి ఖళా ప్రాంగణంలో గురువారం మహిళలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు.ఈ ఆటల పోటీలు ఆర్జి 1 ఏరియా సేవాఅధ్యక్షురాలు శ్రీమతి అనిత లలిత్ అధ్యక్షతన నిర్వహించటం జరిగింది.ఈ పోటీలకు ఆధిక సంఖ్యలో మహిళలు ఏంతో ఉత్సాహంగా పాల్గొని పోటా పోటిగా ఆడారు. వివిధ రకాల ఆటల పోటీలు పిరమిడ్ విత్ గ్లాస్,బాల్ ఇన్ బాస్కెట్,లెమన్ ఇన్ స్పూన్,మ్యుజికల్ చెయిర్,సుదిలో దారం,త్రో బాల్,బాంబ్ ఇన్ దిసిటి ఆటలను నిర్వహించారు.ఈ పోటీలలో గెలుపొందిన వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8న ఉదయం ఆర్.సి.ఓఎ క్లబ్ లో బహుమతుల ప్రధానోత్సవం చేయటం జరుగు తుందని తెలిపారు.కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆర్ జి 1 ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీమతి అనిత లలిత్ తెలిపారు.ఈ కార్యక్రమంలో డీజీఎంపర్సనల్ కిరణ్ బాబు,ఏఐటియుసి డిప్యూటీ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య,సేవా జాయింట్ సెక్రటరిబీనాసింగ్,సీనియర్ పిఓ లు హనుమంత రావు,శ్రావణ్ కుమార్,స్పొర్ట్స్ కో-ఆర్డినేటర్ సంతోష్ రెడ్డి,స్పొర్ట్స్ సూపర్ వైజర్ రమేశ్,సేవా కో-ఆర్డినేటర్ తిరుపతి అధిక సంఖ్యలో మహిళలు పాల్గోన్నారు.