Take a fresh look at your lifestyle.

​ఘనంగా మాధవరం కాంతారావు జన్మదిన వేడుకలు: పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు

హైదరాబాద్ ముద్ర ​కూకట్‌పల్లి, ఫిబ్రవరి 22:
కూకట్‌పల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులు, నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మాధవరం కాంతారావు పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు
కాంతారావును శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంతారావు నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో ప్రజాసేవలో మరింత చురుగ్గా పాల్గొంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కాంతారావుకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.