Take a fresh look at your lifestyle.

బంజారాహిల్స్ లోని కేటీఆర్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పార్టీ సీనియర్ నేత హరీష్ రావు

  • రేవంత్ రెడ్డి అరెస్టయి జైల్లో పడడానికి ఈ కేసుకి పొంతనలేదు
  • రేవంత్ రెడ్డి డబ్బుల కట్టలతో కెమెరాల ముందు దొరికి జైలుకు పోయాడు
  • కేటీఆర్ మాత్రం తెలంగాణ కోసం హైదరాబాద్ బ్రాండ్ ఈమేజి కోసం ఫార్ములా ఈ రేస్ తీసుకువచ్చాడు
  • రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం కేటీఆర్ అక్రమ కేసుకి పోల్చడం అంటే మోకాలికి బోడి గుండు కి ముడి వేయడమే
  • ఎన్ని రకాల కేసులు పెట్టిన మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పైన వెనకకిపోము
  • ఎన్ని కేసులు పెట్టినా నువ్వు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేదాకా నీ వెంట పడతాం
  • అక్రమ కేసులతోనూ అరెస్టులతోనూ మమ్మల్ని బలహీనపరచాలని రేవంత్ రెడ్డి కుట్ర చెల్లదు
  • ఎన్ని రకాల కేసులు పెట్టిన రేవంత్ రెడ్డిని వదిలిపెట్టము
  • ఈరోజు హైకోర్టులో ఇచ్చిన తీర్పు కేసులో అవినీతి జరిగిందని నిర్ధారించలేదు
  • కేసులో అవినీతి ఉందని శిక్ష వేసిన తీర్పు కాదు
  • ప్రభుత్వం అవినీతి జరిగింది అని చెప్పినప్పుడు… విచారణ చేసుకోమని కోర్టు చెప్పింది
  • గతంలో కూడా కేటీఆర్ గారు విచారణకు సిద్ధమని చెప్పాము
  • ఈ అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలా అనే అంశం పైన మా లీగల్ సెల్ నిర్ణయిస్తుంది
  • హైకోర్టు తీర్పు కాపీని పూర్తిగా చదివిన తర్వాత మా లీగల్ సెల్ సలహా మేరకు తదుపరి కార్యాచరణ చేపడతాం
  • మొన్న ఏసీబీ దగ్గరికి కూడా విచారణ ఎదుర్కోవడానికి కేటీఆర్ వెళ్లారు
  • 9వ తేదీన కూడా ఇచ్చిన నోటీసు మేరకు విచారణకు వెళ్తారు
  • మొన్న 45 నిమిషాలు ఆపిన కేటీఆర్ ఓపిగ్గా వేచి చూశారు… కచ్చితంగా విచారణను ఎదుర్కొంటాం
  • హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం కోసమే… ఫార్ములా ఈ ని కేటీఆర్ హైదరాబాద్ కి తెచ్చారు
  • ఇదే రేసును తమ రాష్ట్రాలకు నగరాలకు తీసుకురావడానికి అనేక రాష్ట్రాలు పోటీపడ్డాయి
  • ఒక్క రూపాయి కూడా చేతులు మారినప్పుడు అవినీతి ఎట్లా జరుగుతుంది
  • కేటీఆర్ అడుగడుగునా రేవంత్ రెడ్డి తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే ఈ కేసు
  • అటేషన్ డైవర్షన్ కోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు
  • రైతుబంధు ఎగగొట్టడం వల్ల ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటుంది
  • అన్ని సర్వే రిపోర్టులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తున్నాయి
  • అందుకే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన అక్రమ కేసు పెట్టి అటెన్షన్ డైవర్షన్ కోసం రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారు
  • భవిష్యత్తులను ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ కోసం కేసులు రేవంత్ రెడ్డి పెడతాడని మాకు తెలుసు
  • ఎన్నో పోరాటాలతోనే త్యాగాలతోని తెలంగాణ తెచ్చుకున్నాము
  • తెలంగాణ ప్రజల అభివృద్ధి సంక్షేమమే తెలంగాణ అభివృద్ధిని మా పార్టీకి ముఖ్యం
  • రేవంత్ రెడ్డి ని కూడా ఫార్ములా ఈ కంపెనీ కలిసిన ఇప్పటిదాకా బయట పెట్టలేదు
  • రైతు భరోసాను తగ్గించి ప్రజలకు ఇస్తున్నందుకు… వారి నుంచి వచ్చే వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి ఈ కేసు
  • ఇది కేవలం కక్ష సాధింపు చర్య మాత్రమే
  • ఎన్ని రకాల కేసులు పెట్టిన ఎన్ని రకాల కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడిన తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం
  • అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేము ఎప్పుడూ తెలంగాణ ప్రజల పక్షమే
  • కేటీఆర్ గారి పెట్టిన కేసులు కానీ పార్టీ నేతల పైన పెడుతున్న కేసులను కానీ పార్టీ ఎదుర్కొంటుంది
  • కేటీఆర్ కడిగిన ముత్యంల బయటకి వస్తారు
  • ఎలాంటి తప్పు చేయలేదన్న ధైర్యం ఉంది కాబట్టి విచారణకి వెళ్తాం
  • ఆయన ముఖ్యమంత్రిగా మాకు అధికారుల పైన కోర్టుల పైన విశ్వాసం ఉన్నది కానీ రేవంత్ రెడ్డి పైన లేదు
  • కోర్టులో వచ్చిన తీర్పు పైన కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • కానీ హైకోర్టు చెప్పింది కేవలం విచారణ మాత్రమే చేయమని…
  • విచారణ ప్రారంభం కాకముందే తప్పు జరిగిందని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు
  • కొంతమంది హైకోర్టు తీర్పును తప్పుడుగా వక్రీకరిస్తున్నారు
  • కేటీఆర్ పైన పెట్టిన కేసు తూఫెల్ కేసు
  • అక్రమ అరెస్టులకు మేము భయపడే వాళ్ళం కాదు…
  • సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల పైన చిచ్చరపిడుగుల్లా పోరాడిన చరిత్ర మాది
  • గతంలో అరెస్టై కేటీఆర్ వరంగల్ జైల్లో ఉన్నారు
  • గ్రీన్ కోకి రూపాయి లబ్ధి చేయనప్పుడు వారు ఎందుకు మాకు తిరిగి డబ్బులు ఇస్తారు
  • అదే గ్రీన్కో కంపెనీ ఫార్ములా అయ్యే నిర్వహణలో భారీగా నష్టపోయింది
  • ఇలాంటి పరిస్థితుల్లో వారి నుంచి డబ్బులు వచ్చాయనడం అర్థరహితం

Leave A Reply

Your email address will not be published.