మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టి వేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే వాదనలు ముగించిన న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పుపై తన లీగల్ టీమ్‌తో కేటీఆర్ చర్చిస్తున్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం.