సెక్రటేరియేట్ పేల్చివేస్తానని ఓ వ్యక్తి బెదిరింపులు
ముద్ర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సచివాలయాన్ని పేల్చివేస్తానని ఓ వ్యక్తి బెదిరింపులకు దిగాడు. గత మూడు రోజులుగా హైదరాబాద్ లంగర్‌హౌస్‌కు చెందిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీ అధికారులకు ఫోన్ చేస్తున్నాడు. దర్గాకు సంబంధించి ఓ సమస్యపై ప్రభుత్వానికి తాను అర్చి పెట్టుకున్నానని, అధికారులు స్పందించకపోవడంతో బెదిరింపులకు దిగాడు. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీఎఫ్ పోలీసులు ఫోన్ చేసిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో పోలీసులు, సచివాలయం అధికారులతో మహ్మద్ అలీ వాగ్వాదానికి దిగాడు. ఎందుకు ఫోన్ చేశాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.