ముద్ర కాప్రా
ఉప్పల్ నియోజకవర్గంలో నెలకొన్న త్రాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజను కలిసి వినతిపత్రం అందజేశారు.
బీరప్పగడ్డ, చిలకనగర్, ఉప్పల్ ఓల్డ్ విలేజ్, కురుమనగర్, నగర్, రామంతాపూర్ బాగాయత్ ప్రాంతాల్లో నీటి సరఫరా, కలుషిత నీరు, కొత్త పైప్‌లైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం వంటి సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజలు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని పరమేశ్వర్ రెడ్డి కోరారు. టెండర్ పూర్తైన పనులను వేగవంతం చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.