Take a fresh look at your lifestyle.

సాయిరాం నగర్ కాలనీ నూతన కార్యవర్గం ఎన్నిక

ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని శ్రీసాయిరాం నగర్ కాలానీ బంగారు మైసమ్మ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు నందికొండ రవీందర్ రెడ్డి, సలహాదారులు ఆకుల సురేష్, ఏనుగు బుచ్చిరెడ్డిల ఆధ్వర్యంలో ఈ ఎన్నిక నిర్వహించారు.కమిటీ అధ్యక్షులుగా ఎంపల్ల గోవర్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గంగనమోని సత్యనారాయణ, కోశాధికారిగా నరేష్ గుప్తా, ఉపాధ్యక్షులుగా జ్ఞానేశ్వర్, జుట్టు సతీష్, పండాల దేవేందర్, సంయుక్త కార్యదర్శిగా శ్రీరాములు, ప్రచార కార్యదర్శిగా మాడుగుల శ్రీనివాస్ తో పాటు కార్యవర్గ సభ్యులుగా శివారెడ్డి, కృష్ణ, నరేందర్, భూపాల్ రెడ్డి, రవీందర్ నాయక్, అబ్దుల్ లతీఫ్ లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు గోవర్దన్ రెడ్డి, సత్యనారాయణలు మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.