Take a fresh look at your lifestyle.

టాలెంట్ టెస్టులతో ప్రతిభ వెలికితీత- డిఈఓ విజయ

ముద్ర ప్రతినిధి, మెదక్:*
టాలెంట్ టెస్టులు విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి దోహద పడతాయని మెదక్ జిల్లా విద్యాధికారి విజయ అన్నారు.
ఫిజికల్ సైన్స్ ఫోరం మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం మెదక్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాన్య శాస్త్రం పట్ల ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థులు అభిరుచిని పెంపొందించుకోవాలని సూచించారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి మెదక్ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచాలని ఆమె సూచించారు. ఏఎంఓ సుదర్శన్ మూర్తి, మండల విద్యాధికారులు శంకర్ మధుమోహన్, శ్రీనివాస్, సైన్స్ అధికారి రాజిరెడ్డి,
సైన్స్ ఫోరం బాధ్యులు దయానంద రెడ్డి, ప్రభు, మల్లారెడ్డి, రజిని, ఇందిర తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.