ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండలం భల్లాన్‌పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ మున్సిపల్ సంఘం (ఎఐటియుసి) రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రూ.35,000 విలువైన ప్యూర్ పైడ్ వాటర్ ఫిల్టర్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా స్కూల్ హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల సమక్షంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, తాను ఈ గ్రామంలోనే చదువుకున్నానని, చిన్నప్పటి జ్ఞాపకాలను మరువకుండా సొంత ఊరి అభివృద్ధికి తన వంతు సహాయం అందించడం ఆనందంగా ఉందన్నారు. భల్లాన్‌పల్లి గ్రామం నుంచి చదువుకొని రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగడం అరుదైన విషయం అని పేర్కొన్నారు.
ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని, భవిష్యత్తులో కూడా స్కూల్ అభివృద్ధికి తన సహకారం కొనసాగిస్తానని తెలిపారు.