Take a fresh look at your lifestyle.

పార్టీ మహాసభలకు కదిలిన కమ్యూనిస్టులు

యైటింక్లయిన్ కాలని. ముద్ర: పెద్దపల్లి లో జరుగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా 4వ మహాసభకు కాలనీ పట్టణ పార్టీ శ్రేణులు గురువారం తరలివెళ్లారు. పార్టీ చేపడుతున్న పోరాటాలకు ఆకర్షితులై, సిద్ధాంతాలకు కట్టుబడి కార్మిక, కర్షక, యువజన, మహిళా, విద్యార్థి సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి రాష్ట్ర నాయకత్వంతో కదం కలిపేందుకు కదిలిన కాలనీ కమ్యూనిస్టులు జిల్లా సభలకు ఉదయం బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ఈ మహాసభలు పార్టీ బలోపేతానికి, ప్రజల సమస్యలపై సమగ్ర పోరాట కార్యాచరణ రూపొందించడానికి, మార్గదర్శకంగా నిలవనున్నాయ న్నారు. ఈ మహాసభలలో భాగ స్వాములు కావడం గర్వకారణ మని, పార్టీ పటిష్టత కోరకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఈ సభలు దశ, దిశ ను చూపుతుందని వ్యాఖ్యానించారు. ఇక మహా సభలకు తరలివెళ్లిన వారిలో పార్టీ కమాన్ పూర్ మండల కార్యదర్శి కె.రాజారత్నం, నాయకులు ఎల్. ప్రకాష్, జి. రవీందర్, బి. అన్నారావు, శ్యామ్సన్, జి. సాంబశివరావు, బుర్ర తిరుపతి, కొండ్ర సత్యనారాయణ, సురేష్, నారాయణ, ఆంజనేయులు, లింగయ్య, గోపాల్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.