Take a fresh look at your lifestyle.

గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తాం – చట్టపరమైన అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి ఉత్తమ్

– చట్టపరమైన అవంతారాలను అధిగమిస్తాం
– న్యాయపరమైన చిక్కుల పరిష్కారానికి ప్రక్రియ మొదలు పెట్టాం
– భూసేకరణ ప్రక్రియ వేగవంతం చెయ్యాలి
– రైతులకు న్యాయపరమైన చెల్లింపులు
– జూన్ 2 కు ముందే భూసేకరణకు నిధులు
– ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో :

అనేక ఆవాంతరాలతో అర్దాంతరంగా నిలిచి పోయిన గౌరెల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అన్నివైపులా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇకపై నిధుల కేటాయింపుల్లో కుడా అలసత్వానికి అవకాశం లేకుండా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 1.06లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులతో పాటు న్యాయపరమైన చిక్కులు ఏర్పడడంతో పనులు మందగించాయన్నారు. తాజాగా ఆ అవంతారాలను అధిగమించి ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచుతామన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆయన సిద్దిపేట జిల్లా అక్కనపెట మండలంలో గౌరెల్లి ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనేక ఆవాంతరాలతో అర్దాంతరంగా నిలిచి పోయిన గౌరెల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అన్నివైపులా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఇకపై నిధుల కేటాయింపుల్లో కుడా అలసత్వానికి అవకాశం లేకుండా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. వరద కాలువ ద్వారా వచ్చే నీటితో సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం గౌరెల్లి గ్రామంలో 1.41 టి.యం.సిల నీటితో ఈ రిజర్వాయర్ నిర్మాణం ప్రతిపాదించగా అంచనాలు సవరించి 8.23 టి.యం.సి ల సామర్ధ్యానికి పెంచి అదనపు ఆయాకట్టు సేద్యంలోకి తేవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం సంకల్పమన్నారు. తర్వాత దాన్ని సవరించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు పెట్టమన్నారు. అయితే ఆ సమయంలో భూసేకరణ విషయంలో రైతులకు అందించే చెల్లింపులు న్యాయబద్ధంగా ఉండడంతో పాటు సకాలంలో నిధుల మంజూరుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. గౌరెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణకు అవసరమైన నిధులను జూన్ 2 ముందే విడుదల చేస్తామని అందుకు సంబంధించిన ప్రక్రియను సకాలంలో పూర్తి చేయలని కరీంనగర్, జనగామ, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. న్యాయపరమైన అంశాలను ఎదుర్కొంటున్న గౌరెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన కేసు మరో రెందు రోజుల్లో విచారణకు రానుందన్నారు. ఈ సందర్భంలో చిక్కులను అధిగమించెందుకు అవసరమైన వ్యూహం తో సిద్ధంగా ఉండాలని సమీక్షలో పాల్గొన్న అడ్వకేట్ జెనరల్ ను మంత్రి ఆదేశించారు. రవాణా,బిసి సంక్షేమ శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నిరంతరం ఒత్తిడి పెంచుతున్నామని చెప్పారు. అందుకు సంబంధించిన భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులకు సూ0చించారు. పట్టణీకరణ వేగవంతంగా పెరుగుతున్న నేపద్యంలో భూముల ధరలు పెరగడంతో రైతులు పెద్ద మొత్తంలో నష్టపరిహారం కోరుకుంటున్నారన్న మంత్రి… అందుకు సంబంధించిన విధాన నిర్ణయాలు న్యాయపరంగా తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆదిత్య దాస్ నాధ్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, ఇ. ఎన్.సి జెనరల్ రమేష్ బాబు లతో పాటు కరీంనగర్ జనగామ,సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.