Take a fresh look at your lifestyle.

ఫిబ్రవరి 12న జరిగే సమ్మెను జయప్రదం చేయాలి.

 

ముద్ర నడిగూడెం….

దేశవ్యాప్తంగా ఈ నెల 12 న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని నడిగూడెం గ్రామపంచాయతీ మండల వర్కర్స్ సిఐటియు మండల అధ్యక్షుడు సుభాని కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో మల్సూర్ నాయక్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల అధ్యక్షుడు సుభాని మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనo 26 వేల వరకు అమలు చేయాలని, 10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ, సిఐటియు మండల కన్వీనర్ మల్లెల వెంకన్న, గ్రామపంచాయతీ వర్కర్స్ చీమట నాగరాజు, మధుసూదన్, తిరపయ్య తిరపయ్య, ఫీల్డ్ అసిస్టెంట్లు పద్మ, స్వరూప, సీతారాంరెడ్డి, సిహెచ్ ఉపేందర్, వీరాంజనేయులు, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.