ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మరియు జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 30-04-2026 గురువారం నాడు ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ తెలిపారు.
పట్టణంలోని పాత కలెక్టరేట్ భవనంలో గది నెంబర్ 102లో ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఈ శిబిరం జరుగుతుందని పేర్కొన్నారు. శిబిరంలో పాల్గొనే రోగులకు ప్రత్యేక కంటి పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షల అనంతరం అవసరమైన వారికి, ముఖ్యంగా ముత్యబిందు (కాటరాక్ట్) సమస్య ఉన్న రోగులకు ఉచితంగా కంటి ఆపరేషన్లు మహబూబ్ నగర్ జిల్లా ఏనుగొండలోని లయన్ రామ్ రెడ్డి కంటి ఆసుపత్రిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. రోగులను ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
శిబిరానికి హాజరయ్యే వారు ముందుగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకుని వాటి నివేదికలను వెంట తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ లేదా ఏదైనా గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీతో పాటు ఫోన్ నెంబర్ తీసుకురావాలని తెలిపారు.
ఆపరేషన్ అనంతరం రోగులను 02-05-2026 శనివారం ఉదయం 9 గంటలకు పాత కలెక్టరేట్ కార్యాలయం వద్ద తిరిగి విడిచిపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
9440876556, 7386940480