ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తోందంటూ రైతు కలెక్టరేట్ కు ధాాన్యంబస్తా తో వచ్చి నిరసన వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండలం బాబాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ గ్రామానికి చెందిన రైతు ధాన్యం కొనుగోలు చేయాలని ధాన్యం బస్తాతో కలెక్టరేట్ కు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ధాన్యం 15 రోజులైనా ధాన్యం కొనుగోలు చేయడం లేదని, వెంటనే కొనుగోలు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. అలాగే బస్తాకు 41 కిలోలు తూకం వేస్తున్నారని ఆరోపించారు. అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయి మొలకలు వస్తున్నాయని వెంటనే కలెక్టర్ స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని ఆ రైతు కోరారు.