Take a fresh look at your lifestyle.

నిర్మల్ లో సినీ నటి ఐశ్వర్యా రాజేష్ సందడి

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వండర్ ల్యాండ్ ప్రారంభోత్సవానికి సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ సినీ నటి ఐశ్వర్యా రాజేష్ ఆదివారం వచ్చారు. ఆమె నిర్మల్, ముధోల్ ఎంఎల్ఏలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ లతో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగు వందల ఏళ్ల కు పైగా చరిత్ర ఉన్న నిర్మల్ కు రావటం ఆనందంగా ఉందన్నారు. నిర్మల్ బొమ్మలకు అంతర్జాతీయ ఖ్యాతి ఉందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమెతో ఫోటోలు దిగేందుకు, చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు.

Leave A Reply

Your email address will not be published.