కుమారుడి గొంతు కొయ్యడానికి యత్నించగా కేకలు…
తాను ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి రత్నకళ కూతురు బెజ్జంగి కీర్తన రెడ్డి (14)గొంతు కోసి హత్య చేసింది. కొడుకు బెజ్జంగి అంశాంత్ రెడ్డి నీ కూడా కత్తితో గొంతు కోయడానికి యత్నించగా తప్పించుకుని కేకలు వేశాడు.

అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాబు కేకలు విని అక్కడికి చేరుకున్న తుక్కపురం గ్రామస్తులు. శనివారం రాత్రి అత్తారిల్లు బీబీనగర్ మండలం జైనపల్లి నుండి తుక్కాపురం అమ్మవారి ఇంటికి వచ్చిన నిందితురాలు.
నిందితురాలైన రత్నకళ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ కీ తరలించారు.