Take a fresh look at your lifestyle.

మళ్లీ జల దోపిడి మొదలైంది

  • బాబుకు గురుదక్షిణగా రాష్ట్రానికి మోసం చేస్తున్నారు.
  • బనకచర్లతో రాష్ట్రానికి చాలా నష్టం.
  • 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించే కుట్ర.
  • తెలంగాణలో ప్రాజెక్టులన్నింటికీ చంద్రబాబు అడ్డుపడ్డాడు. 
  • మన రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదు. 
  • బనకచర్లను ఆపేందుకు బీజేపీ చొరవ చూపాలి.
  • లేదంటూ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తాం. 
  • జల ఒప్పందాల ప్రకారమే పాలమూరు డీపీఆర్​ పంపితే కేంద్రం ఎందుకు రిటర్న్​ పంపింది.
  • మాజీ మంత్రి హరీశ్​రావు.
ముద్ర, తెలంగాణ బ్యూరో:  రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. బనకచర్ల ద్వారా ఏపీ ప్రభుత్వం 200 టిఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయే కుట్ర చేస్తోందన్నారు.ఇది రాష్ట్రానికి తీరని నష్టం కలిగించనుందన్నారు.అయినప్పటికీ రేవంత్ సర్కార్  మొద్దు నిద్రలో ఉండడం శోఛనీయమని వ్యాఖ్యానించారు. కేవలం గురు దక్షణ చెల్లించుకోవడం కోసం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను సైతం పణంగా పెడుతున్నారని విమర్శించారు.  గోదావ‌రి – బ‌న‌క‌చ‌ర్ల‌కు  ఎలాంటి అనుమ‌తి లేకుండానే ఏపీ ముందుకు వెలుతోందన్నారు.ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన జ‌ల‌దోపిడీ.. కాంగ్రెస్ పాల‌న‌లో మ‌ళ్లీ మొద‌లైందని మండిపడ్డారు.ఆదివారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ,  కేంద్రంలోని మోడీ సర్కార్ ను అడ్డం పెట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన ఇష్టాను సారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారి విమర్శించారు.పైగా బనకచర్లకు మిగులు జలాల వాడుకుంటున్నాం అని సుద్దులు చెబుతున్నాడని  ధ్వజమెత్తారు. అయితే  అవి గోదావరి మిగులు జలాలు  కాదని తెలంగాణ వినియోగించుకోకపోవడం వల్ల కిందకు వెళ్తున్న నీళ్లు అని అన్నారు. ఇందులో అసలు కుట్ర ఏమిటంటే గోదావరి మీద ట్రిబ్యునల్ వేయాలని ఏపీ ప్రభుత్వం  ఇప్పటికే ఫిర్యాదు చేసిందన్నారు.గోదావరి ట్రిబ్యునల్ వచ్చే లోపే బనకచర్ల నిర్మించి, ప్రజాధనం ఖర్చు అయ్యింది కాబట్టి నీళ్లు తీసుకోవాలని బాబు కుట్ర చేస్తున్నారని ఆరోపంచారు.ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతోందన్నారు.ఇవన్నీ తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం లేదని మండిపడ్డారు.తెలంగాణ చేప‌ట్టిన ప్రాజెక్టుల‌కు చంద్ర‌బాబు అనేక సార్లు మోకాలు అడ్డుపెట్టారన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు ర‌ద్దు చేయాల‌ని కేంద్రానికి లేఖ‌లు రాశారని గుర్తు చేశారు.వాటిల్లో పాల‌మూరు, భ‌క్త‌రామ‌దాసు, డిండి ప్రాజెక్టులు కూడా ఉన్నాయన్నారు. అయినప్పటికీ రేవంత్ సర్కార్ మాత్రం ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా తెలంగాణకు నష్టం జరిగే విధంగా ఉన్న పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.ఒక వైపు  కేంద్రం తెలంగాణ ప్రాజెక్టుల‌కు అనుమ‌తి ఇవ్వ‌ట్లేద‌ని రేవంత్ అసెంబ్లీలోనే పలుమార్లు చెప్పారన్నారు.నీతి ఆయోగ్ స‌మావేశం బ‌హిష్క‌రిస్తామ‌ని కూడా అన్నారన్నారు.  కాని శనివారం జరిగిన సమావేశంలో రేవంత్ అంద‌రి కంటే ముందే వెళ్లి  కూర్చున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఏ అనుమ‌తులు లేని గోదావ‌రి – బ‌న‌క‌చ‌ర్లను ఎందుకు ఆయన  అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ స‌మావేశంలో రేవంత్ రెడ్డి ఎందుకు నిలదీయలేదని అడిగారు.
  • రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బీజేపీ.
బీజేపీ తెలంగాణ‌కు ద్రోహం చేస్తుందని హరీశ్ రావు మండిపడ్డారు.  కేంద్రం తెలంగాణ‌ ప్రాజెక్టుల‌కు అనుమ‌తు ఇవ్వ‌దు గానీ ఏపీ ప్రాజెక్టుల‌కు అనుమ‌తులు లేకున్నా నిధుల క‌న‌వ‌వ‌ర్షం కురిపిస్తోందన్నారు.ఇదెక్క‌డి నీతి..? అని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి కేంద్రమంత్రులుగా కొనసాగుతున్న నేతలంతా ఏం చేస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రానికి ఇంత  అన్యాయం జరుగుతుంటే జి. కిష‌న్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. వెంటనే చొర‌వ‌ తీసుకుని రాష్ట్ర పక్షాన. ఢిల్లీకి అఖిల‌ప‌క్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.అలాగే పోల‌వరం ద్వారా 80 టీఎంసీల నీటిని కృష్ణా ప‌రివాహ‌క ప్రాంతానికి మ‌ళ్లించిన‌ట్లు అయితే ఆ 80 టీఎంసీలు ఎగువ‌న ఉన్న రాష్ట్రాల‌కు చెందుతాయ‌ని బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్ అవార్డు ఇచ్చిందన్నారు. ఇందులో సుప్రీం కూడా త‌ల దూర్చ‌దన్నారు. తెలంగాణ‌కు 45 టీఎంసీలు, క‌ర్ణాట‌కుకు 25, మ‌హారాష్ట్ర‌కు 14 టీఎంసీలు అని చెప్పిందన్నారు. సీడ‌బ్ల్యూసీకి క‌ర్ణాట‌క ద‌ర‌ఖాస్తు చేస్తే.. అప్ప‌ర్ భ‌ద్ర ప్రాజెక్టుకు 25 టీఎంసీలు కేటాయించిందన్నారు.అలాగే మ‌హారాష్ట్ర‌కు చెందిన 14 టీఎంసీలు ఇచ్చిందన్నారు.అదే ప‌ద్ధ‌తుల్లో 45 టీఎంసీలు తెలంగాణకు ద‌క్కాల‌ని ఈ నీటిని పాల‌మూరు ఎత్తిపోత‌ల‌కు కేటాయించండి అంటే డీపీఆర్ వాస‌ప్ పంపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.ఇది బీజేపీకి తెలంగాణ ప‌ట్ల ఉన్న వివ‌క్ష‌కు నిద‌ర్శ‌నం కాదా అని మండిపడ్డారు. మరి ఇంత దుర్మార్గంగా ఎట్ల వ్య‌వ‌హ‌రిస్తారని నిలదీశారు.అదే బ‌చావ‌త్ ఇంకో మాట కూడా చెప్పిందని 90 టీఎంసీల కంటే ఎక్కువ తీసుకుపోయినా ఇదే నిష్ప‌త్తిలో ఎగువ‌న ఉన్న రాష్ట్రాల‌కు కృష్ణా న‌దిలో నీటి వాటాలు కేటాయించాల‌ని చెప్పిందన్నారు.మరి ఆ లెక్క‌న‌ తెలంగాణ‌కు 112 టీఎంసీలు రావాలన్నారు. అంటే మొత్తం 157 టీఎంసీలు తెలంగాణ‌కు క‌లిపి ఇవ్వాలన్నారు.దీంతో క‌ల్వ‌కుర్తి, డిండికి నిక‌ర జ‌లాలు కేటాయించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఏపీలోని పోలవరం జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం తెలంగాణలోని కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వదని మండిపడ్డారు. పైగా పోలవరానికి రూ. 80వేల కోట్ల, బనకచర్లకు మరో రూ. 80వేల కోట్లు.. అంటే లక్షా 60వేల కోట్లు ఏపీకి ఇస్తున్నకేంద్రం అందులో ఒక్క శాతం అయినా తెలంగాణ ప్రాజెక్టులకు ఇచ్చారా? అని ప్రశ్నించారు.రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బిజేపీ ఎంపీలు ఉండి ఏం లాభమని మండిపడ్డారు.ఇప్పటికైనా కాంగ్రెస్ మొద్దు నిద్ర వీడాలన్నారు.రాష్ట్ర హక్కులు కాపాడేందుకు నడుంబిగించాలన్నారు.ఈ విషయంలో అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయడానికైనా తాము సిద్ధమేనని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.