Take a fresh look at your lifestyle.

వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కాంగ్రెస్ భరోసా

  • ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పోరాటానికి మద్దతుగా ఉంటాం.
  • ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్.

ముద్ర, తెలంగాణ బ్యూరో : వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జహీరాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ అన్ని మతాల లాగే ఈ దేశంలో జీవించే హక్కు ముస్లింలకు కూడా ఉందన్నారు.వక్ఫ్ బోర్డు ఆస్తులపై బీజేపీ కన్నేసిందని, అందుకే వక్ఫ్ చట్టాన్ని తీసుకొని వచ్చిందని ఆరోపించారు. ముస్లింలు సైతం స్వతంత్ర పోరాటంలో త్యాగాలు చేశారని, బీజేపీ ఏం త్యాగం చేసిందని ఆయన ప్రశ్నించారు. ఈ సభలో ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, కర్ణాటక రాష్ట్ర మంత్రి రహీం ఖాన్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహిద్దిన్ తదితరులు పాల్గొన్నారు. కాగా సభ జరుగుతుండగా భారీ ఈదురుగాలులు వీచాయి. దీంతో లైటింగ్ పోల్ కింద పడిపోయి ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. సభకు హాజరైన ఈ నేతలు నేరుగా ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు.

Leave A Reply

Your email address will not be published.