- సామాజిక సంస్కరణలు, సమానత్వం, విద్య వ్యాప్తికి ఎనలేని కృషి చేశారు.
- తల్లిదండ్రులు తమ పిల్లల విద్యకు ప్రాధాన్యమివ్వాలి.
- చదువు పిల్లలు, సమాజం తలరాతను మారుస్తుంది.
- మహిళలను స్వేచ్ఛగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్దాం.
- దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసింది.
- ప్రసాద్ ల్యాబ్ లో బీసీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘం నేతలతో కలిసి పూలే చిత్రాన్ని వీక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో :సామాజిక సంస్కరణలు, సమానత్వం, విద్య వ్యాప్తికి ఎనలేని కృషి చేసిన మహోన్నతమైన ఆదర్శమూర్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.ఆదివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో మహాత్మా జ్యోతిరావు పూలే సినిమాను బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, బీసీ సంఘాల నేతలతో కలిసి మంత్రి సినిమాను వీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక మార్పు, సంస్కరణలు, సమానత్వం కోసం మహిళా సాధికారత పై జ్యోతిరావు పూలే,సావిత్రి భాయ్ పూలేల అనితర సేవలను మంత్రి ఈ సందర్భంగా కొనియాడారు.కంచె ఐలయ్య సూచనల మేరకు ప్రభుత్వం పూలే సినిమాను తెలుగులో డబ్బింగ్ చేస్తామని ప్రకటించారు. రాబోయే తరానికి విద్యను అందించడానికి తల్లిదండ్రులు తమ పిల్లలనుక వారి శక్తిమేరకు చదివించాలని కోరారు. రేపటి దేశ భవిష్యత్తుకు విద్యార్థులే పునాదులని చెప్పారు. సమాజంలో అందరూ విద్యకు దగ్గర అవుతారని చెప్పారు. మహిళలను స్వేచ్ఛగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. దేశంలో మొట్టమొదటిసారిగా వెనుకబడిన బలహీన వర్గాలకు సంబంధించి కాకాసాహెబు కాలేల్కర్ ఒక ప్రతిపాదనను సిద్ధం చేశారన్నారు. అలాగే బీసి మండల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దేశంలో వీరు బీసీ ల వికాసం కోసం పని చేశారని, వీరికి స్పూర్తి జ్యోతిరావు పూలేనని పేర్కొన్నారు. వీరందరి కృషిని కొనసాగిస్తూ తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం దేశంలో మొదటిసారి కుల గణన చేపట్టినట్లు మంత్రి వివరించారు. ఇదంతా మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తిదాయకమని చెప్పారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్లు వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ లకు కూడా కల్పించాలన్నప్పుడు ఆ అంశం పెండింగ్ లో పడిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని, సినిమా ప్రముఖులను కలిసి ఈ సినిమా డబ్బింగ్ తీసి టాక్స్ మినహాయింపు చేసేలా చేస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్ గా కులగణన చేసుకున్నామని అలాగే బీసీ లకు చట్టంలో రిజర్వేషన్లు పెంచుకున్నామని తెలిపారు.సినిమాలో చూపించిన సారాంశాన్ని ప్రతి బలహీన వర్గాల బిడ్డ సమాజంలో ఎవరు విద్యకు దూరంగా ఉండకుండా చూడాలని సూచించారు.మహిళా అభ్యున్నతి మహిళా సాధికారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు. సినిమా వీక్షించిన వారిలో ప్రభుత్వ సహలదారు కేశవ రావు, సామాజిక వేత్త కంచ ఐలయ్య, ఎంపీలు సురేష్ షెట్కర్, అనిల్ కుమార్ యాదవ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీసీ ఎమ్మెల్యేలు కాలేరు వెంకట్, ముఠా గోపాల్, శ్రీహరి ముదిరాజ్, శంకరయ్య, ప్రకాష్ గౌడ్, కార్పొరేషన్ చైర్లన్ లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లు ,మార్కెట్ కమిటీ చైర్మన్ లు పాల్గొన్నారు.