Take a fresh look at your lifestyle.

​ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం: బండి రమేష్

​అల్లాపూర్ డివిజన్ సఫ్దర్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పాదయాత్ర

ముద్ర కూకట్‌పల్లి :

ప్రజా సమస్యల పరిష్కారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు శనివారం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్‌లో ఆయన స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
​క్షేత్రస్థాయిలో సమస్యల పరిశీలన
​పాదయాత్రలో భాగంగా బండి రమేష్ గల్లీ గల్లీ తిరుగుతూ స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా సఫ్దర్ నగర్ ప్రాంతంలో
​అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు.
​పొంగిపొర్లుతున్న డ్రైనేజీ వ్యవస్థ.​త్రాగునీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
​ప్రజల విన్నపాలపై రమేష్ తక్షణమే స్పందించారు. అక్కడి నుండే వాటర్ వర్క్స్ జీఎం (GM) తో ఫోన్‌లో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన జీఎం, వెంటనే సంబంధిత ఏరియా ఈఈ ని ఘటనా స్థలానికి పంపి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
​ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. “ముందుగా డ్రైనేజీ లైన్ల పనులను పూర్తి చేసి, ఆ తర్వాత పక్కాగా రహదారుల నిర్మాణం చేపడతాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం చూపుతాం” అని హామీ ఇచ్చారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించిన రమేష్‌కు స్థానిక ప్రజలు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భారీ సఫ్దర్ నగర్‌ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.