Take a fresh look at your lifestyle.

వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
సామాజిక సేవ చేయడం అదృష్టంగా భావించాలని, ఇలాంటి కార్యక్రమాలకు యువజన సంఘాలు, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని జోగిపేట మున్సిపల్ చైర్మన్ ఎస్.క్రిష్ఱారెడ్డి పిలుపునిచ్చారు.దాతలు బిల్డర్ సురోత్తమ్రెడ్డి, పారిశ్రామిక వేత్త సారా శివకుమార్లు ముందుకు రాగా వివేకానంద యువజన సంఘం ఆద్వర్యంలో గురవారం పట్టణంలో పలు చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశారు.చైర్మన్ క్రిష్ణారెడ్డి వీటిని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన సూచించారు.జోగిపేట చుట్టు పక్కన గల సుమారు 50 గ్రామాల నుంచి ప్రజలు వ్యాపారం నిమిత్తం జోగిపేటకు వస్తుంటారనీ,వారి దప్పిక తీర్చడానికి ముందుకు వచ్చిన వివేకానంద యూవజన సంఘం యువకులను ఆయన అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మునుముందు మరెన్నో చేపట్టాలని మున్సిపల్ తరపున మాసహాకారం ఉంటుందన్నారు.తహశీల్దార్ కార్యాలయం ముందు,బాలుర ఉన్నత పాఠశాల, క్రీడామైదానంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ప్రవీణ్, మణినాగ్చంద్ర,సాయి దిలిప్, అఖిల్,డాకూరి సాయి, సాయి,నాగరాజు,త్రిశాంక్,శివ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.