ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
జిల్లాలో మహిళల ఆర్థిక స్వావలంబనకు మరొక ముందడుగు పడింది.బేటి బచావో–బేటి పడావో పథకం కింద మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ,కుట్టు యంత్రాల పంపిణీతో పాటు బ్యూటీషియన్ శిక్షణ తరగతులను గురువారం ప్రారంభించారు.మహిళా శిశు సంక్షేమ శాఖ,జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావో–బేటి పడావో పథకం కింద గురువారం సంగారెడ్డి బాలసదనంలో ఈకార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా 50 మంది లబ్ధిదారులకు కుట్టు యంత్రాలను పంపిణీ చేయగా, మరో 25 మంది లబ్ధిదారులకు బ్యూటీషియన్ శిక్షణ తరగతులను ప్రారంభించారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి,వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం ఈకార్యక్రమం ప్రధాన లక్ష్యం.
ప్రత్యేకంగా ఆర్థికంగా వెనుకబడిన మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులు,చదువు మధ్యలో మానేసిన వారు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు.ఈకార్యక్రమాన్ని టీజీఐసీసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి,జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా మొక్కలు నాటారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి టీజీఐసీసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ,మహిళల అభ్యున్నతికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ,బేటి బచావో–బేటి పడావో పథకం ద్వారా కుట్టు యంత్రాల పంపిణీ,బ్యూటీషియన్ శిక్షణలతో మహిళల జీవనోపాధి మెరుగుపడుతుందని తెలిపారు.స్వయం ఉపాధి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలని మహిళలకు సూచించారు.మున్సిపల్ చైర్‌పర్సన్ వనిత సంతోష్ మాట్లాడుతూ మహిళలు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు.జిల్లా సంక్షేమ అధికారిణి లలితా కుమారి, మహిళా శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాలపై వివరించారు.ఈకార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి, సీడీపీఓ చంద్రకళ,డిసిపిఓ రత్నం,చిల్డ్రన్ సూపరింటెండెంట్ విజయ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.