ముద్ర, కోరుట్ల, కథలాపూర్;
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనీ తీవ్రవాది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఐసీసీ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిష్టి బొమ్మను కోరుట్ల భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో దహనం చేశారు.

ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వయసు ఎక్కువ కావడం తో మతి భ్రమించి నోటికి ఏదీ వస్తే అది మాట్లాడం సరికాదు అని అన్నారు. ఖర్గే నీ ఒక మంచి హాస్పిటల్ లో చూపించాలని, ఏఐసీసీ పదవి నుండి తొలగించి ఇకనైనా భారతీయ జనతా పార్టీ గురించి, పార్టీ నాయకులు గురించి నోటికొచ్చింది మాట్లాడితే కాంగ్రెస్ నాయకుల ఇళ్ళముందు వారి దిష్టి బొమ్మలను ఇలాగే దహనం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కోరుట్ల పట్టణ కౌన్సిలర్స్ కలాల రాధ సాయిచంద్, సోరుపాక రమాదేవి రమేష్, గుగ్లావత్ శ్రీకాంత్, తిరుమల వాసు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎర్ర రాజేందర్, గిన్నెల శ్రీకాంత్, మాడవేణి నరేష్, పోతూగంటి శ్రీనివాస్, నాయకులు తుక్కారం గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు పంచారి విజేయ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి రాజు, బీజేపీ బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.