Take a fresh look at your lifestyle.

పర్యావరణ పరిరక్షణ పై అవగాహన అవసరం డీఈఓ భోజన్న

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతపై పూర్తి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న అన్నారు. అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే సందర్భంగా జాతీయ గ్రీన్ కోర్ సంస్థ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు “భూమిని కాపాడుకుందాం”, “ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం”, “పచ్చదనం పెంచుదాం” వంటి నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి భోజన్న మాట్లాడుతూ అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే పక్షాన్ని జరుపుకోవాల్సిన అవసరాన్ని విద్యార్థులకు వివరించారు. భూమిని సంరక్షించడం మనందరి బాధ్యత అని, చిన్నచిన్న చర్యల ద్వారా కూడా పర్యావరణాన్ని కాపాడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీరజరాణి, ఎన్ జి సి జిల్లా సమన్వయ కర్త మోహన్ రావు, సెక్టోరల్ అధికారి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు, కృష్ణ, వివేక్, భూమన్న, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.